దేవి శ్రీ ఏంటో మరోసారి చూపిస్తాడా..?

shami
సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో ఆయన సినీ కెరీర్ మొదలవగా ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ దేవి శ్రీ తన సంగీతాన్ని అందిస్తూనే ఉన్నారు. కొద్దిగా ఫాం తగ్గింది అనిపించిన ప్రతిసారి తన మ్యూజిక్ తో అదరగొట్టేస్తాడు డి.ఎస్.పి. పుష్ప లాంటి సినిమాకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఎంత హెల్ప్ అయ్యింది అన్నది మాటల్లో చెప్పడం కష్టం. సుకుమార్ దేవి శ్రీ ఫ్రెండ్ షిప్ చాలా స్పెషల్ గా ఉంటుంది.
అందుకే అందరి సినిమాలకు ఒకలా సుక్కు సినిమాకు మరోలా అన్న రేంజ్ లో ప్రత్యేకంగా సాంగ్స్ ఇస్తుంటాడు దేవి. పుష్ప పార్ట్ 1 లో దేవి శ్రీ ప్రసాద్ కూడా తన మ్యూజిక్ తో మెప్పించాడు. తెర మీద అల్లు అర్జున్ వీరంగం ఆడేస్తే తెర వెనక దేవి దుమ్ము దులిపేశాడు. అయితే పుష్ప 2 తో మరోసారి దేవి సత్తా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
ఆల్రెడీ పుష్ప 2 కి సంబంధించిన సాంగ్స్ అన్ని పూర్తి చేశారట. ప్రస్తుతం ఆర్.ఆర్ ని ఏర్పాటు చేస్తున్నారట. పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండేలా చూస్తున్నారట. మొత్తానికి పుష్ప 1 కాదు అంతకుమించి అనిపించేలా పుష్ప 2 మ్యూజిక్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. దేవి శ్రీ స్టామినా ఏంటో పుష్ప 2తో కూడా మరోసారి ప్రూవ్ చేసుకుంటాడని తెలుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్, దేవి శ్రీ ఈ కాంబో ఎప్పుడు సెట్ అయినా అవుట్ పుట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. పుష్ప 1 సాంగ్స్ ఎలా యూట్యూబ్ లో వందల మిలియన్లు దాటాయో పుష్ప 2 సాంగ్స్ కూడా అదే రేంజ్ లో ఉండేలా దేవి మ్యూజిక్ ఇస్తున్నాడని తెలుస్తుంది. మొత్తానికి పుష్పతో దేవి కూడా తన రేంజ్ ఏంటన్నది చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: