"రామబాణం" మూవీ డిలీట్ సీన్స్ రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో గోపీచంద్ ఒకరు. ఈయన మొదట హీరో గా తన కెరీర్ ను మొదలు పెట్టి పెద్దగా గుర్తింపును తెచ్చుకో లేక పోయాడు. ఆ తర్వాత జయం మూవీ లో విలన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా వర్షం , నిజం మూవీ లలో విలన్ పాత్రలలో నటించి తన అద్భుతమైన విలనిజంతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించాడు. ఆ తరువాత యజ్ఞం మూవీ లో హీరో గా నటించిన గోపీచంద్ ఈ మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత నుండి గోపీచంద్ కేవలం సినిమాల్లో హీరో పాత్రల్లోనే నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా గోపీచంద్ "రామబాణం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాకు శ్రీ వాసు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి డింపుల్ హయాతి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు ... కుష్బూ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించగా ... మిక్కి జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మే 5 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు భారీ కలెక్షన్ లు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా 2 గంటల 22 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొత్తం రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాలు కాగా ఇందులో నుండి 16 నిమిషాలను తీసి వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ నుండి ఇప్పటికే ఈ చిత్ర బృందం డిలీటెడ్ సీన్స్ పేరుతో 4 వీడియోలను విడుదల చేసింది. అందులో మొదటి వీడియో 4 నిమిషాల 45 సెకండ్లు ఉండగా ... రెండవ వీడియో 3 నిమిషాల 56 సెకండ్లు , మూడవ వీడియో 4 నిమిషాల 39 సెకండ్లు ,  4 వ వీడియో 2 నిమిషాల 53 సెకండ్ల నిడివి తో ఉంది. ఈ మొత్తం కలుపుకుంటే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: