సలార్ విషయంలో ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు... మరోసారి అధికారిక ప్రకటన చేసిన మూవీ బృందం..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కే జీ ఎఫ్ చాప్టర్ 1 ... చాప్టర్ 2 మూవీ లతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడుగా సూపర్  క్రేజ్ ను సంపాదించుకున్నటు వంటి ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమరన్ ఈ సినిమాలో విలన్ పాత్రల్లో కనిపించబోతున్నారు.
 

కే జి ఎఫ్ మూవీ కి సంగీతం అందించి ఇండియా వైడ్ గ సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న రవి బస్రుర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనునట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడం ... అలాగే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పట్టనున్న నేపథ్యంలో ఈ మూవీ విడుదల పోస్ట్ పొన్ అయ్యే అవకాశం ఉంది అని అనేక వార్తలు తాజాగా బయటకు వచ్చాయి. దానితో స్పందించిన ఈ మూవీ బృందం తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ ... సలార్ మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. సలార్ మూవీ ని ముందు చెప్పినటు వంటి తేదీ అయిన 28 సెప్టెంబర్ 2023 వ తేదీనే థియేటర్ లలో విడుదల చేస్తాం అని మరో సారి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: