కస్టడీ : చైతూకి ఇది చాలా దారుణం?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా మూవీ 'కస్టడీ'. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది.తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఆరంభంలోనే భారీ అంచనాలను ఏర్పరచుకుంది. దాని ఫలితంగా అత్యధిక బిజినెస్ను జరుపుకుని.. ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది.నాగ చైతన్య హీరోగా చేసిన 'కస్టడీ' మూవీకి ఆరంభంలోనే తెలుగు తమిళ భాషల్లో నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు దీనికి ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాలేదు. ఫలితంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా సరిగా రాలేదు. ఇదే కంటిన్యూ అవుతూ రెండో రోజు కూడా 'కస్టడీ' మూవీ ఎంతగానో నిరాశ పరిచింది. శనివారం రోజు హాలీడే ఉన్నా ఈ సినిమా అంతగా రాణించలేదు.మంచి క్రేజీ కాంబినేషన్లో వచ్చిన 'కస్టడీ' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు చాలా దారుణమైన పరిస్థితినే ఎదుర్కొందని చెప్పాలి.


ఫలితంగా శనివారం నాడు సెలవు దినం అయినప్పటికీ ప్రేక్షకుల స్పందన దక్కకపోవడంతో  కేవలం రూ. 80 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.ఇక వీటితో కలుపుకుంటే రెండు రోజుల్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 2.62 కోట్లు షేర్ ఇంకా రూ. 4.80 కోట్లు గ్రాస్ను మాత్రమే వసూలు చేసింది. నాగ చైతన్య 'కస్టడీ' సినిమాకి రెండు రోజుల్లో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు ఓవర్సీస్లో రూ. 80 లక్షలు తమిళ వెర్షన్కు రూ. 15 లక్షలు వచ్చాయి. ఇలా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో చాలా దారుణాతి దారుణంగా రూ. 3.68 కోట్లు షేర్ రూ. 7.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే.. రూ. 25 కోట్లు టార్గెట్తో వచ్చిన ఈ సినిమా ఇంకా మరో రూ. 21.32 కోట్లు వసూలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ సినిమా వల్ల నాగ చైతన్య ఇమేజ్ బాగా డామేజ్ అయ్యింది. స్టార్ హీరో నుంచి టైర్ 2 హీరో స్థాయికి ఈ సినిమా దిగజార్చింది. ఇక తరువాత సినిమాతో అయిన నాగ చైతన్య గట్టి హిట్టు కొడతాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: