LEO: లియో చిత్రంలో ఐటెం సాంగ్ లో స్టార్ హీరోయిన్..!!

Divya
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం లియో.. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు.తెలుగు లోనే కాకుండా వివిధ భాషలలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇందులో హీరోయిన్ గా త్రిష నటిస్తూ ఉన్నారు.ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ప్రియ ఆనంద్, అర్జున్ తదితరులు సైతం పలు పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండగా యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్సర్వ్ స్టంట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఖైదీ, విక్రమ్ సినిమాలోని పాత్రలు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యేవిధంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన ఈ ఏడాది విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులోనే స్పెషల్ సాంగులు హీరోయిన్ శృతిహాసన్ ఐటెం సాంగ్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

గతంలో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు చిత్రం తో పరవాలేదు అనిపించుకున్న విజయ దళపతి ఈ ఏడాది కూడా లియో సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తారేమో చూడాలి మరి. విజయ్ దళపతికి సరైన సక్సెస్ లేక దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతొంది. దీంతో అభిమానులు సైతం లియో సినిమా పైన భారీగా అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలను మించిపోయేలా ఈ సినిమా ఉంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: