"ఖుషి" మూవీ ఫస్ట్ సింగిల్ కు 5 భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ... విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి దర్శకుడుగా గుర్తింపును తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శివ నర్వన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా పూర్తి అయింది.

ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది  అలాగే ఈ మూవీ ని తెలుగు భాషతో పాటు తమిళ , కన్నడ  , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం మొదటి పాటను విడుదల చేసింది. ఈ పాటను ఈ చిత్ర బృందం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసింది. ఈ పాట తెలుగు లో "నా రోజా నువ్వే" అంటూ సాగుతుంది.

ఈ పాటకు తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాంగ్ కు ఇప్పటివరకు 10 మిలియన్ న్యూస్ రాగా , హిందీ వర్షన్ సాంగ్ కు 7.3 మిలియన్ న్యూస్ , తమిళ్ వర్షన్ సాంగ్ కు 2.4 మిలియన్ న్యూస్ , మలయాళ వర్షన్ కి 143 కే  వ్యూస్ z కన్నడ వర్షన్ కు 122 కే వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సాంగ్ కు 5 భాషల్లో కలిపి 20 మిలియన్స్ న్యూస్ వరకు వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం ఈ సాంగ్ కు 5 భాషల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: