ఇప్పటికి అలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వని అనసూయ....!!

murali krishna
అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో మధ్యలో రాహుల్ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఆమెను సూటిగా ఓ ప్రశ్న అడిగారు.ఫైర్ బ్రాండ్ అనసూయ అసలు తగ్గడం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సై అంటే సై అంటుంది. మాటకు మాట, కౌంటర్ కి కౌంటర్ ఇచ్చేస్తుంది. నిన్న సోషల్ మీడియా వేదికగా రెండు పోస్ట్స్ పెట్టారు. ఓ వీడియో బైట్ విడుదల చేసిన అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని చేతకాని వాళ్ళు, అదుపు తప్పారని తిట్టిపోశారు. మీడియాకు ధైర్యం ఉంటే నిజాలు రాయాలంటూ మండిపడ్డారు.అలాగే ఓ చేశారు . నన్ను తిడితే మీ నోళ్లు కంపు అవుతాయి. నాకు ఏమీ కాదు. నాది గొప్ప పెంపకం. ఏదైనా ధైర్యంగా మాట్లాడతాను. మీ పెంపకం ఎలాంటిదో మీరే తెలుసుకోండి. తిట్టే వాళ్ళు సిగ్గుపడాలి, తిట్టించుకున్న వాళ్ళు కాదు,  అని కామెంట్ చేశారు. అనసూయ చేసిన పోస్టు కి నటుడు రాహుల్ రామకృష్ణ స్పందించారు.
ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఇంతకీ ఈ గొడవేంటి? అని అనసూయ పోస్ట్ క్రింద కామెంట్ పెట్టాడు. ఇవ్వన్నీ మీరు ఎందుకు చేస్తున్నారని రాహుల్ రామకృష్ణ నేరుగా అనసూయను ప్రశ్నించారు. రాహుల్ రామకృష్ణ కామెంట్ వైరల్ గా మారింది.
 
అయితే రాహుల్ రామకృష్ణ ప్రశ్నకు అనసూయ ఇంకా స్పందించలేదు. సాధారణంగా వెంటనే ఆమె రిప్లై ఇస్తుంది. కారణం తెలియదు కానీ... రాహుల్ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదు. ఫైర్ బ్రాండ్ అనసూయ ప్రముఖ నటుడు అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలని నెటిజెన్స్ ఆతృతగా ఎదురుచుస్తున్నారు.

రాహుల్ రామకృష్ణ-విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్స్. ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటి నుండి పరిచయం ఉంది. వీరిద్దరికీ ఫేమ్ తెచ్చిన మూవీ అర్జున్ రెడ్డి. రాహుల్ రామకృష్ణ ఆ చిత్రంలో విజయ్ ఫ్రెండ్ రోల్ చేశారు. రాహుల్ రామకృష్ణ రోల్ చాలా సహజంగా ఉంటుంది. అలాగే మంచి కామెడీ పంచుతుంది.
తన ఫ్రెండ్ మీద అనసూయ సెటైర్స్ వేస్తున్న క్రమంలో రాహుల్ రామకృష్ణ కల్పించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హీరో విజయ్ దేవరకొండ పేరు ముందు "The' అని పెట్టడాన్ని అనసూయ తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఖుషి చిత్ర పోస్టర్స్ లో ది విజయ్ దేవరకొండ అని రాసిన నేపథ్యంలో అనసూయ స్పందించారు. పరోక్షంగా సెటైర్స్ వేశారు. దాంతో వివాదం రాజుకుంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ సోషల్ మీడియా వేదికగా వేధింపులకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: