ప్రభాస్ ప్రశాంత్ నీల్.. దిల్ రాజు ప్లాన్ అదుర్స్..!

shami
రెబల్ స్టార్ ప్రభాస్ తను చేస్తున్న వరుస సినిమాలతో భారీ క్రేజ్ తో పాటుగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఈ ఇయర్ ఆదిపురుష్, సలార్ పార్ట్ 1 సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకోగా ప్రాజెక్ట్ ఖ్ నెక్స్ట్ ఇయర్ అంటే 2024 సంక్రాంతికి దించుతున్నారు. సలార్ పార్ట్ 2 కూడా ఉంటుందని తెలుస్తుండగా దానికి కొంత టైం ఉంటుందని తెలుస్తుంది. సలార్ 2, సందీప్ వంగ స్పిరిట్ సినిమాల తర్వాత ప్రభాస్ మరోసారి ప్రశాంత్ నీల్ తోనే మరో మూవీ చేస్తాడని అంటున్నారు.
బడా నిర్మాత దిల్ రాజు ఈ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేసే సినిమా మైథలాజికల్ సినిమాగా ప్లాన్ చేస్తున్నారట. ఈ జనరేషన్లో మైథలాజికల్ సినిమాలను  ఎన్.టి.ఆర్ టచ్ చేశాడు. ఆయన మాత్రమే ఇలాంటి సినిమాలు చేయగలడు అని చెప్పుకుంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్ ఈసారి ప్రభాస్ తో అలాంటి ప్రయోగం చేస్తున్నారట.
ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాడని టాక్. స్లార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ఇలా కమిట్ అయిన సినిమాలన్నీ త్వరగా పూర్తి చేసి ప్రశాంత్ తో మైథలాజికల్ సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారట. చూస్తుంటే ప్రభాస్ తో దిల్ రాజు పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. సలార్ 1, 2 తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ తో సినిమా చేస్తున్నడు. అది పూర్తయ్యాక మళ్లీ ప్రభాస్ తోనే ఈ సినిమా చేస్తారట. ప్రభాస్ మైథలాజికల్ మూవీ అనగానే ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో బాహుబలి అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: