గ్లామర్ హద్దులు చెరిపేసిన వేల..కీర్తి సురేష్..!!

Divya
టాలీవుడ్ లో హీరోయిన్ కీర్తి సురేష్ అందానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె నటనకు అందానికి సైతం అభిమానులు ఫిదా అవుతూ ఉంటారు.. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే సమయంలో కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త సన్నబడి మరింత నాజూగా తయారయింది. ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో డి గ్లామరస్ హీరోయిన్గా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు.
తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల అప్డేట్లను సైతం ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో గ్లామర్ షో చేయడానికి కాస్త వెనుకడుగు వేసిన కీర్తి సురేష్ సర్కారు వారి పాట సినిమాలో మాత్రం గ్లామర్ హద్దులు దాటి మరి అందాలను వలకబోసింది. ఈ సినిమా కూడా కీర్తి సురేష్ కు మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచి వరుసగా ఫోటోషూట్లతో గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను మైమరిపిస్తూ ఉంటుంది. తాజాగా సర్కారు వారి పాట చిత్రంలో నటించిన కళావతి క్యారెక్టర్ గురించి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ వన్ ఇయర్ ఫర్ కళావతి వన్నియర్ ఫర్ సర్కార్ వారి పాట అంటూ క్యాప్షన్ ని రాసుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులకు షేర్ చేయడంతో విపరీతంగా ఆకట్టుకుంటోంది .ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్లామర్ నటనకు మాత్రం ఫుల్ మార్కులు పడ్డాయి. ఈ సినిమా నుంచి గ్లామర్ హద్దులు పూర్తిగా చెరీపేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తూ ఉన్నది ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. అంతేకాకుండా కీర్తి సురేష్ ఖాతాలో మరో నాలుగు సినిమాలు ఉన్నట్టుగా సమాచారం. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది కీర్తి సురేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: