విడాకులపై క్లారిటీ ఇచ్చిన శ్రీయ..!?

Anilkumar
ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రియ. ఇక ఆ సినిమా తర్వాత నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి ఇలా వరుసగా స్టార్ హీరోలు అందరితో కూడా నటించింది ఈమె. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈమె కొద్ది రోజులకే స్టార్ హీరోయిన్ స్టేటస్ను దక్కించుకుంది. ఇక అలాంటి ఈమె సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. గతంలో ఈమె నాగార్జున రానా వంటి హీరోలతో ప్రేమాయణం నడిపిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది..
 తెలుగుతోపాటు తమిళ, కన్నడ ,మలయాళ భాషల్లో సైతం నటించింది.

శ్రియతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్ లో చాలామంది పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ 40 ఏళ్ల వయసు దాటినా కూడా పాతికేళ్ల హీరోయిన్ లాగా కనిపిస్తోంది.అనంతరం ఆండ్రయ్ కోత్చవ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. గతంలో శ్రియ తన భర్తతో విడాకులు తీసుకుపోతుంది అని ఆ విషయంలో వారిద్దరికీ గొడవలు వస్తున్నాయి అంటూ గతంలో కొన్ని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఏ విషయంలో ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా శ్రీయ మాట్లాడుతూ

 అసలు నా భర్తకి నాకు విడాకుల వార్తలు మీడియాలో చెక్కర్లు కొట్టడానికి కారణం నేను గతంలో గమనం సినిమా సమయంలో మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న టైంలో కొంతమంది నా భర్త గురించి నన్ను అడిగారు. దానితో నేను ప్రమోషన్స్ గురించి మాట్లాడకుండా ఎందుకు నా భర్త గురించి అడుగుతున్నారు అని అడిగాను.దాంతో అప్పటినుండి శ్రేయ భర్తతో గొడవ లో పెట్టుకుంటుందని వార్తలు వైరల్ చేశారు .అంతేకాదు మేమిద్దరం విడాకులు తీసుకోబోతున్నాము అంటూ కూడా కొన్ని వార్తలు చేశారు. అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంటూ స్పష్టం చేసింది శ్రియ. దీంతో తన విడాకులపై శ్రీ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: