"నిజమైన ప్రేమ రెట్టింపు అయ్యేది అప్పుడే".. రాజ్ నిడమోరు చెల్లెలు ఘాటు కౌంటర్..!
ఈ నేపథ్యంలో, శీతల్ తన కుటుంబంతో కలిసి సమంత, రాజ్ ఉన్న ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ—“ప్రేమను పంచుకుంటే ప్రేమ రెట్టింపు అవుతుంది… వీళ్లిద్దరికీ శతమానం భవతి”అంటూ, శతమానం భవతి సినిమాలోని ఒక భావోద్వేగ గీతాన్ని కూడా జత చేసింది. ఈ పోస్ట్‌కి వేగంగా వ్యూస్, లైక్స్, కామెంట్లు రావడంతో అది సోషల్ మీడియాలో ప్రధాన చర్చగా మారింది.
దీంతో అనేక మంది ఇలా అభిప్రాయపడుతున్నారు..రాజ్ మాజీ భార్య తన మాజీ కుటుంబంతో దూరంగా ఉండడం, ఆమె భావోద్వేగ పోస్టులు పెట్టడం వంటి అంశాలు చూస్తుంటే, శ్యామల–రాజ్ ఫ్యామిలీ మధ్య ఏదో విభేదం ఉండొచ్చని కొందరు ఊహిస్తున్నారు. అదే కారణంగా సమంతకు అండగా నిలుస్తూ, శీతల్ ఆ ఫోటోకు అలా ప్రేమపూర్వకమైన కామెంట్ పెట్టిందేమో అని సోషల్ మీడియాలో అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సమంత–రాజ్ వివాహం ఒక వైపు భారీ హడావుడి సృష్టిస్తుంటే, మరో వైపు వీళ్ల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్, కుటుంబ సభ్యుల ప్రతి పోస్టు వరకు ప్రజలు ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. ఈ మొత్తం ఘటనల్లో శ్యామల, శీతల్, సమంత—ముగ్గురి ప్రొఫైల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.