చత్రపతి హిందీ రీమేక్.. అన్ని కోట్లు రాబట్టాల్సిందే.. లేదంటే ఫ్లాపే?

praveen
మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇక ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసాడు. టాలీవుడ్ లో వర్కౌట్ కాదు అనుకున్నాడో ఏమో బాలీవుడ్లో అడుగు పెట్టేసాడు. ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  చత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయగ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు వి వి నాయక్ దర్శకత్వం వహించాడు. ఇటీవల మే 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది అని చెప్పాలి.

 అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి అటు హిందీ మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. యూట్యూబ్లో ఈ హీరో నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో హిందీలో తనకు ఉన్న మార్కెట్కు అనుగుణంగానే చత్రపతి సినిమాను బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా కామెడీ ట్రాక్ లవ్ సీన్స్ తగ్గించి యాక్షన్ పార్ట్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చారట. అయితే చత్రపతి హిందీ రీమేక్ బాలీవుడ్ లో మెప్పించలేక పోయిందని వార్తలు వస్తున్నాయి.

 బాలీవుడ్ క్రిటిక్స్ ఈ సినిమాపై పెదవి విరిచారు అన్నది తెలుస్తుంది. ఇక మొదటి రోజు నుంచి ఈ సినిమా పూర్తిగా ప్రతికూల పరిస్థితుల మధ్య సాగుతుంది. అయితే ఇక బడ్జెట్ అన్ని ఖర్చులు కలిపి.. ఈ సినిమాకు 50 కోట్లతో విలువ కట్టారు. ఈ సినిమాను 2000 స్క్రీన్ లలో రిలీజ్ చేయగా.. ఓవర్సీస్ లో 300 స్క్రీన్ లలో రిలీజ్ చేశారు. అయితే తొలిరోజు ఈ సినిమా అటు బాలీవుడ్ లో కోటి రూపాయలు ఓవర్సీస్ లో 25 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల నుండి సమాచారం. అయితే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ గా 55 కోట్లను నిర్ణయించారు. ఈ సినిమా 75 కోట్ల రూపాయలు వసూలు చేస్తేనే హిట్గా మారుతుంది. లేదంటే యావరేజ్ లేదా ఫ్లాప్ గానే మిగిలిపోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: