భర్తతో కలిసి.. మాజీ ప్రియుడిని కలిసిన కాజల్?

praveen
టాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ కూడా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత చందమామ అనే సినిమాలో నటించి మరో హిట్టును ఖాతాలో వేసుకుంది. అటు వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మగధీర సినిమాలోరామ్ చరణ్ కు జోడిగా నటించింది ఈ సొగసరి.

 ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించడంతో కాజల్ అగర్వాల్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది అని చెప్పాలి. అయితే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లోని కొంతమంది హీరోలతో డేటింగ్ చేసిందంటూ అప్పట్లో ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. రామ్ చరణ్ తో పాటు రానా తో కూడా అటు కాజల్ డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి సీత సినిమాలో నటించిన కాజల్.. ఇక వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఇప్పుడు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ ఇద్దరు హీరో హీరోయిన్లు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి.

 బెల్లంకొండ శ్రీనివాస్ ని మిస్ అవుతున్నట్లు ఒక పాత ఫోటోని పోస్ట్ చేసింది కాజల్. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా స్పందిస్తూ నేను కూడా నేను మిస్ అవుతున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవమంటే ఎలా అంటూ రొమాంటిక్ గా స్పందించాడు. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చత్రపతి హిందీ రీమేక్ లో నటించాడు. ఈ సినిమా 12న రిలీజ్ రిలీజ్ అయింది. అయితే ఇటీవల కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీంతో కాజల్ భర్తతో కలిసి మాజీ ప్రియుడిని కలిసింది అంటూ మీడియాలో వార్తలు ప్రత్యక్షమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: