పవన్ మొదటి భార్య నందిని.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడో. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటు పోతున్నాడు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్.. మరోవైపు రాజకీయాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి.  అయితే  పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ మూడు పెళ్లిళ్ల విషయం తరచూ వార్తలో నిలుస్తూనే ఉంది.

 ప్రత్యర్థి పార్టీల నేతలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఎప్పుడూ ప్రస్తావన తీసుకొస్తూ విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయి అన్నా లెజెనోవాను పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని గురించి చాలా తక్కువ మందికే తెలుసు. 1997లో విశాఖకు చెందిన నందినినీ మొదట వివాహం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్  బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది.

 కానీ కొద్ది రోజులకే వీరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో ఆ గొడవలు విడాకుల వరకు దారి తీసాయ్. అప్పట్లో నందిని పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కాగా 2007లో నందిని నుంచి పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బద్రి సినిమాలో తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ తో కొన్నాళ్లు సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నారు. పవన్ మొదటి భార్య నందిని ప్రస్తుతం తన పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010లో డాక్టర్ కృష్ణ రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. వీళ్ళకి 200 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయట. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ నందిని సంతోషంగా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: