#SS4: పిచ్చెక్కించిన హాట్ హీరోయిన్తో సుధీర్ రొమాన్స్?

Purushottham Vinay
బుల్లితెర సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ అలాగే బ్యాచ్లర్ సినిమాతో ఇంటర్నెట్ ని షేక్ చేసి యూత్ కి పిచ్చెక్కించిన హాట్ హీరోయిన్ దివ్య భారతి హీరోహీరోయిన్లుగా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం #SS4(వర్కింగ్ టైటిల్).నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ ఇంకా బెక్కం వేణుగోపాల్, లక్కీ మీడియా అలాగే మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నేడు ఈ సినిమా ఓపినింగ్ చాలా ఘనంగా జరిగింది.ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ ఇంకా కెఎల్‌ దామౌదర ప్రసాద్‍ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.


నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ.. "ఈ సినిమా స్క్రిప్ట్ వన్ ఇయర్ క్రితమే ఫైనల్ అయిపోయింది. 4, 5 మంత్స్ నుంచి ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేసాం.ఇక ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్ గారే కర్త, కర్మ , క్రియ అన్ని. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మా సినిమాను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను." అని అన్నారు.


ఇక దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ... "సుధీర్ గారికి ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు చాలా బాగా నచ్చి ఒప్పుకున్నారు.మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కూడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు. లియో మాకు మంచి మ్యూజిక్ ని ఇచ్చారు. మా రైటర్  ఫణికి థాంక్యూ." అని అన్నారు.


ఇక నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.."ఈ సినిమా ఫస్ట్ షాట్ కి చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా ఇంకా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. చాలా హిట్ సినిమాలు చేసాను. ఇది కూడా ఖచ్చితంగా ఒక హిట్ సినిమా అవ్వబోతుంది. మీ సపోర్ట్ కూడా కావాలి. దర్శకుడు నరేష్ తో నాకు మొత్తం ఏడేళ్ల పరిచయం ఉంది." అని అన్నారు.


ఇక ఈ సినిమా హీరో సుధీర్ మాట్లాడుతూ.. "ఇక్కడికి వచ్చిన అందరికి పెద్ద థాంక్యూ. నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం ఈ మీడియానే.టీం అందరి గురించి కూడా ఇది వరకే చెప్పారు. ఇంకా డీటెయిల్ గా మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను ఖచ్చితంగా పంచుకుంటాం థాంక్యూ." అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: