ది కేరళ స్టోరీ: వివాదాలతోనే వసూళ్ల వర్షం కురిపిస్తోందిగా?

Purushottham Vinay
ఎన్నో వివాదాలతో ఇంకా మరెన్నో అల్లర్లతో దేశ వ్యాప్తంగా విడుదలైన సినిమా 'ది కేరళ స్టోరీ'. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యి వసూళ్ల వర్షం కురిపిస్తోంది.టాలీవుడ్ హాట్ బ్యూటీ ఆదాశర్మ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఇండియాలో సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. ఎన్ని వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే బాన్ చేసినా కూడా ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నాయి.ఇక ప్రొడ్యూసర్లకు అయితే లాభాల పంట పండిస్తోంది ఈ మూవీ.రోజు రోజుకీ ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. వారం లోపు ఏకంగా రూ.86 కోట్లను రాబట్టింది. అందులోనూ వీకెండ్ మొదలవుతుంది కాబట్టి సోమవారానికి ఈ మూవీ ఖచ్చితంగా 100 కోట్ల మార్క్ ని చేరుకోవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.


ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది 'ది కేరళ స్టోరీ' సినిమా.వరుసపెట్టి జనాలు ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు. తమిళపాడు, కేరళ ఇంకా వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఈ సినిమాని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నాలు చేశాయో.. మధ్య ప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాలు ఈ ది కేరళ స్టోరీ సినిమాకి అంతే అండగా నిలుస్తున్నాయి.ఇక మే 5 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్డ్ డే రూ.8 కోట్లను వసూలు చేయగా ఇక రెండు రోజు దానికి మించేలా ఏకంగా రూ.11.22 కోట్లను రాబట్టింది. ఇక మూడో రోజు అయితే సూపర్ గా రూ.16.40 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా నాలుగో రోజు రూ. 10.07 కోట్లు, ఐదో రోజు రూ.11.14 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాకి ఎస్ సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. ఆదా శర్మ లీడ్ రోల్ లో నటించి ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: