ఛత్రపతి హిందీ రీమేక్ హిట్టా? ఫట్టా?

Purushottham Vinay
రాజమౌళి ప్రభాస్ వంటి స్టార్ కాంబినేషన్ లో 2005 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి. ప్రభాస్ ను మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గర చేసిన సినిమా ఇది.. ఆ సినిమాను ఇన్ని సంవత్సరాల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో రీమేక్ చేశారు.అయితే ఛత్రపతి హిందీ వెర్షన్ ఇప్పటికే హిందీ ఆడియన్స్ చూసి ఉన్నారు. అయినా కూడా తన హిందీ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ సినిమా అనుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తెలుగు మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ని డైరెక్టర్ గా పెట్టి హిందీలో ఛత్రపతి సినిమాని తీశారు.పెన్ స్టూడియోస్ బ్యానర్ లో జయంతి లాల్ గాద అక్షయ్ గాద ధవల్ గాద ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ ఛత్రపతి సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన కథే కాబట్టి పెద్దగా ఆశించక పోవచ్చు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ సీక్వెన్స్ అయినా అలరిస్తాయని అనుకున్నారు. కానీ అవి కూడా ఓవర్ డోస్ అయినట్టు సమాచారం తెలుస్తుంది.


బెల్లంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాలకు హిందీలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ధైర్యంతోనే హిందీలో ఛత్రపతి సినిమాని రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. కానీ ఛత్రపతి సినిమాని ఆల్రెడీ చూసేసిన హిందీ ఆడియన్స్ బెల్లంకొండ సినిమాపై అంత ఆసక్తిని అయితే చూపించలేదు.ఇక ఛత్రపతి సినిమాలో హీరోయిన్ గా నటించిన నుస్రత్ కి అయితే కేవలం 3 సాంగ్స్ రెండు సీన్స్ మాత్రమే అన్నట్టుగా ఉంది. సినిమాలో హీరోయిన్ కన్నా మిగతా పాత్రలకు స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ దొరికింది.ఎస్ ఎస్ రాజమౌళి ఛత్రపతి సినిమాను చాలా బ్రిలియంట్ గా తీశాడు. మాస్ ఆడియన్స్ బాగా మెచ్చేలా ఈ సినిమా బాగా తీశాడు. కానీ వినాయక్ ఈ రీమేక్ విషయంలో తన మార్క్ చూపించలేకపోయాడని హిందీ ఆడియన్స్ అంటున్నారు. ఛత్రపతి హిందీ రీమేక్ కి టాక్ అంత గొప్పగా అయితే రాలేదు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. మరి సినిమాకు పెట్టిన బడ్జెట్ ని అయినా రాబడుతుందా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: