పుష్ప 2 పై సరికొత్త అప్డేట్.. మాస్ జాతరే..!

Divya
ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప.. ఈ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను మాయ చేసారు అంతే కాదు ఈ సినిమాలోని పాటలు ,డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.ప్రముఖ క్రికెటర్స్ కూడా ఈ డైలాగ్స్ ను రీ క్రియేట్ చేసి మరి వైరల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరిచిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా కూడా షూటింగ్ సెర వేగంగా జరుపుకుంటుంది.
ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టరు రిలీజ్ అయ్యి సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇకపోతే ఇవి రిలీజ్ అయ్యి నెల రోజులైనా సరే ఇంకా ఆ వీడియో ఇంపాక్ట్ ప్రజల్లో కొనసాగుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ వైరల్ గా మారింది.అయితే అదే సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది ? ఏ సీన్స్ చేస్తున్నారు అనే విషయంపై తాజాగా సమాచారం లభించడం గమనార్హం. పుష్ప 2 షూటింగు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలో ఉన్న మారేడుమిల్లి అడవుల్లో.. ఆ దగ్గర్లో ఉన్న మోతుగూడెం గ్రామంలో జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే అక్కడ తాండా జనాలు,  చిత్ర యూనిట్ తెగ సందడి చేస్తున్నారు. ఇక సుకుమార్ ఆయన చిత్ర బృందంతో పాటు మెయిన్ టెక్నికల్ టీమ్ మొత్తం కూడా అక్కడే ఉన్నారు. అలాగే పుష్పతో జస్ట్ శాంపుల్ చూపించాను అంటున్న సుకుమార్ ఇప్పుడు రెండవ భాగంతో బన్నీ విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్  కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఇక ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: