ఫాస్ట్ గా 100 కే లైక్స్ ను సాధించిన టాలీవుడ్ టాప్ 5 ట్రైలర్లు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమా ట్రైలర్ లు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమా ట్రైలర్ లపై విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అలా భారీ అంచనాలు నెలకొని ఉన్న ట్రైలర్ లకు అదిరిపోయే రేంజ్ వ్యూస్ మరియు అదిరిపోయే రేంజ్ లైక్స్ వస్తూ ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఇప్పటి వరకు విడుదల అయిన సినిమా ట్రైలర్ లలో అత్యంత వేగంగా 100 కే లైక్స్ ను సాధించిన మూవీ ట్రైలర్ లు ఏవో తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ యొక్క ట్రైలర్ కేవలం 4 నిమిషాల్లోనే 100 కే లైక్స్ ను సాధించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 7 నిమిషాల్లోనే 100 కే లైక్స్ ను సాధించింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా వేణు శ్రీరామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ 8 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ ను సాధించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ 9 నిమిషాల్లో 100 కే లైక్స్ ను సాధించింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఆది పురుష్ మూవీ ట్రైలర్ 9 ప్లస్ మినిట్స్ లో 100 కే లైక్స్ ను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: