"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ హిందీ బ్లాక్ బాస్టర్ మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి హృతిక్ రోషన్ ... సైఫ్ అలీ ఖాన్ తాజాగా విక్రమ్ వేద అనే సినిమాలో కలిసిన నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పుష్కర్ - గాయత్రి లు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2017 వ సంవత్సరం లో విడుదల అయినటు వంటి తమిళ సినిమా విక్రమ్ వేద కు అధికారిక హిందీ రీమేగా రూపొందింది. అప్పటికే తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించి ఉండడంతో ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండడం గానే హిందీ సినీ ప్రేమికులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.
 

అలా భారీ అంచనాల నడుమ ఈ మూవీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున హిందీ భాషలో థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను దక్కించుకున్న జియో సినిమా సంస్థ ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా మే 12 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ మూవీ ని ఫ్రీ గా జియో సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ మూవీ జియో సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: