ఒకేసారి ఆ ఇద్దరు స్టార్ హీరోల కోసం పని చేస్తున్న త్రివిక్రమ్..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు వస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సినిమా సినిమాకు తమ క్రేజ్ ను పెంచుకుంటూ చాలా సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నారు. అలా చాలా సంవత్సరాలుగా అద్భుతమైన క్రేజ్ ఉన్న డైరెక్టర్ గా కెరియర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథలను... మాటలను అందించిన త్రివిక్రమ్ ప్రస్తుతం సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే తన కెరీర్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ దర్శకుడు ఆఖరుగా అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన అలా వైకుంటపురంలో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.

ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ హీరో గా పూజ హెగ్డే... శ్రీ లీల హీరోయిన్ లుగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలా మహేష్ హీరోగా రూపొందుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తూనే త్రివిక్రమ్... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అదిరిపోయే కథను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది . సుధీర్ వర్మ దర్శకత్వంలో పవన్ నటించబోయే మూవీ కోసం ప్రస్తుతం త్రివిక్రమ్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకే సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి మహేష్... పవన్ సినిమాలకు త్రివిక్రమ్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: