ఆ మూవీతో 32 కోట్లు నష్టపోయాను... దానితో ఈ ఇండస్ట్రీ మనకు అవసరమా అనిపించింది... అశ్విని దత్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్న అశ్విని దత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నిర్మాత వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇప్పటికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

ఈ మధ్య కాలంలో ఈ నిర్మాణ సంస్థ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన మహానటి మూవీ ని... నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందిన జాతి రత్నాలు మూవీ ని ... దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీతా రామం మూవీ లను నిర్మించింది. ఈ మూవీ లు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ వారు ప్రాజెక్టు కే అనే భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ ని రూపొందిస్తున్నారు.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రస్తుతం వరుస మూవీలను నిర్మిస్తూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న అశ్విని దత్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా ద్వారా దారుణంగా నష్టపోవడంతో ఇక సినిమా ఇండస్ట్రీ మనకు అవసరమా అనిపించింది అని కామెంట్లు చేశాడు. అసలు విషయం లోకి వెళితే... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన శక్తి సినిమాతో 32 కోట్లు నష్టపోయాను అని , ఆ మూవీ తర్వాత 4 , 5 సంవత్సరాల సినిమాలు కూడా తీయలేదు అని , అలాగే శక్తి మూవీ తర్వాత ఇక ఇండస్ట్రీ మనకు అవసరమా వదిలేసి వెళ్ళిపోదాం అని కూడా అనిపించింది అని తాజాగా అశ్విని దత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: