ఆసక్తిరేపుతున్న మళ్ళీ పెళ్లి ట్రైలర్?

Purushottham Vinay
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా 'మళ్ళీ పెళ్లి' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవిత్ర లోకేష్.. నరేష్ కు జోడీగా నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో అందరి చూపు పడింది.ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్ ఇంకా పవిత్ర డేటింగ్ చేస్తున్నారు.నరేష్ కు ఆల్రెడీ మూడు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. అయితే పవిత్ర లోకేష్ ను నరేష్ 4 వ పెళ్లి చేసుకోవడానికి నరేష్ మూడో భార్య అస్సలు ఒప్పుకోవడం లేదు. అందువల్ల ఆమె నరేష్ కు విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేదు.దీంతో నరేష్ చేసేదేమి లేక 'మళ్ళీ పెళ్లి' అనే మూవీని తీసుకుని సరిపెట్టుకున్నాడు. ఇది నరేష్- పవిత్ర ల బయోపిక్ అని టీజర్ చూస్తే పూర్తిగా అర్ధం అయిపోయింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక అప్పుడు టీజర్లో అయితే నరేష్ వైపు నుండి మాత్రమే కథని చూపించారు.

ఇంకా అలాగే నరేష్ - పవిత్ర ల రిలేషన్ గురించి టాలీవుడ్ సీనియర్ లెజెండరీ స్టార్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల ఎలా స్పందించారు? అనే అంశాన్ని కూడా ట్రైలర్లో చూపించడం జరిగింది. ఈ సినిమాలో నరేష్ - పవిత్ర వారి వారి పాత్రల్లోనే నటిస్తున్నారు. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్రలో తమిళ నటి వనిత విజయ్ కుమార్ నటిస్తుంది. ట్రైలర్ అయితే ఆసక్తి కరంగా ఉంది.యం.యస్.రాజు ఈ సినిమాని నిర్మాత నరేష్ కు అనుకూలంగా తెరకెక్కించినట్లు స్పష్టమవుతుంది.ఇక నరేష్ ని పవిత్రని ట్రోల్ చేసిన వారే ఈ ట్రైలర్ ని విపరీతంగా చూస్తున్నారు. రిలీజ్ అయిన కొద్దీ గంటల్లోనే ఈ సినిమాకి భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: