అదరగోడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్?

Purushottham Vinay
గబ్బర్ సింగ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తరువాత మరోసారి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.ఇక రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కేవలం 8 రోజులోనే ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తరువాత షెడ్యూల్ కి సిద్దమవుతుంది. అయితే ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు మూవీ టీం రెడీ అయ్యింది. పవన్ ఇంకా హరీష్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ నేటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.అందువల్ల ఈ స్పెషల్ డేని మరింత స్పెషల్ చేసేలా ఉస్తాద్ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ తెలిపిన విషయం తెలిసిందే. ఇక మార్నింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసిన మూవీ టీం తాజాగా గ్లింప్స్ కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది. ఇక గ్లింప్స్ పవన్ అభిమానులతో పాటు ప్రతి ఒకర్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

మరోసారి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ జాతర తీసుకు రాబోతుందని గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. కాగా ఉస్తాద్ షెడ్యూల్ పూర్తి చేసి OG సెట్స్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా OG షెడ్యూల్ ని కూడా పూర్తి చేశాడు.పవన్ కళ్యాణ్ త్వరలోనే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నాడు. యంగ్ హాట్ బ్యూటీ శ్రీలీల  ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. గబ్బర్ సింగ్ కి సంగీతం అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా ఆడియో పై కూడా చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ ప్రొడక్షన్ కంపెనీ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: