PS2: ఇంటికాడ పులి.. మిగిలిన చోట్ల పిల్లి?

Purushottham Vinay
తమిళ లెజెండరీ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఎంతో మంది కోలీవుడ్ స్టార్ల ను కలిపి చేసిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా 'పొన్నియన్ సెల్వన్'.గత సంవత్సరం వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో దీనికి సీక్వెల్గా 'పొన్నియన్ సెల్వన్ 2'సినిమాను తెరపైకి తీసుకొచ్చారు.ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' మూవీకి ఆరంభంలోనే చాలా మంచి టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా భారీగా దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే తెలుగులో మాత్రం మంచి టాక్ తెచ్చుకున్న పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. ముఖ్యంగా రెండో వారంలో మాత్రం ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మొత్తంగా పెద్ద నిరాశే ఎదురవుతోంది.ఇక 'పొన్నియన్ సెల్వన్ 2' ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి రూ. 14.05 కోట్లు గ్రాస్ రాబట్టింది. అలాగే తమిళనాడులో రూ. 114.25 కోట్లు కర్నాటకలో రూ. 19.50 కోట్లు కేరళలో రూ. 15.35 కోట్లు రెస్టాఫ్ ఇండియాలో రూ. 22.45 కోట్లు ఇంకా అలాగే ఓవర్సీస్లో కలిపి తమిళ వెర్షన్ రూ. 116.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.


తమిళ బాహుబలి గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా 12 రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 302.25 కోట్లు గ్రాస్ అలాగే రూ. 145.30 కోట్లు షేర్ ను మాత్రమే వసూలు చేసింది.ఇక ఇది క్లీన్ హిట్ స్టేటస్ ను చేరుకోవాలంటే  ఇంకా రూ. 26.70 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే అది చాలా కష్టమే అని విశ్లేషకులు అంటున్నారు.అన్ని ఏరియాల్లో కంటే తెలుగులోనే 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమాకి చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఆంధ్రా తెలంగాణలో రూ. 10 కోట్లు బిజినెస్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటి దాకా రూ. 6.62 కోట్లే రాబట్టగా.. ఇంకా హిట్ స్టేటస్ కు రూ. 3.88 కోట్ల దూరంలో ఉంది. తమిళ భాష తప్ప మిగిలిన భాషల్లో ఈ సినిమాకు నష్టాలు తప్పేలే లేవు. దీంతో PS2 పరిస్థితి ఇంటికాడ పులి మిగిలిన చోట్ల పిల్లిలాగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS2

సంబంధిత వార్తలు: