రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీ ప్రకటన..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ "బోయపాటి రాపో" అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం మే 15 వ తేదీన రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టైటిల్ మరియు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతోంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో పాటు ఈ సంవత్సరం మే 15 వ తేదీన రామ్ పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తన తదుపరి మూవీ ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేయబోతున్నట్లు ... ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల మే 15 వ తేదీన రాబోతున్నట్లు సమాచారం. ఇది వరకే రామ్ ... పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఈస్మార్ట్ శంకర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: