రామ్... పూరితో కాకుండా ఆ తమిళ దర్శకుడితో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈ యువ నటుడు తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో క్లాస్ మూవీ లలో నటించే క్లాస్ ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ... ఎన్నో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటించిన మాస్ ... కమర్షియల్ మూవీ లను ఇష్టపడే ప్రేక్షకులను కూడా బాగానే అలరించాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 

ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు అని అనేక వార్తలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం రామ్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... రామ్ తన తదుపరి మూవీ ని పూరి జగన్నాథ్ తో కాకుండా ఇప్పటికే ఎన్నో తమిళ ... తెలుగు మూవీ లకు దర్శకత్వం వహించినటు వంటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ... ఈ మూవీ ని కూడా తమిళ్ మరియు తెలుగు లో రూపొందించ బోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి రామ్ తన తదుపరి మూవీ ని పూరి జగన్నాథ్ తో చేస్తాడా ... లేక గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: