"కస్టడీ" మూవీ మొదలైన అన్ని నిమిషాల తర్వాత మామూలుగా ఉండదు... చైతూ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరో గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు కొంత కాలం క్రితమే అమీర్ ఖాన్ హీరో గా రూపొందినటు వంటి లాల్ సింగ్ చడ్డ అనే మూవీ తో హిందీ శని పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటన తో చైతు హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చతూ ... వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... ప్రియమణి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. 

అరవింద స్వామి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు. ఈ సినిమాను మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా చాతూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... కస్టడీ మూవీ మొదలు అయినా 40 నిమిషాల తర్వాత నుండి సినిమా థియేటర్ లు బ్లాస్ట్ అవుతాయి. ఆ "బి జి ఎం" కు మీరంతా రచ్చ రచ్చ చేస్తారు. మే 12 న మీరంతా నా కస్టడీ లోకి వచ్చేస్తారు ... అని నేను సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాను అని నాగ చైతన్య తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: