"వీర సింహారెడ్డి" మూవీకి ఫస్ట్ టైం వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటి శృతి హాసన్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది.


ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్ ... దునియా విజయ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో హనీ రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు కూడా దక్కాయి.


 చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" లో కూడా మంచి ప్రేక్షకాదరణ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బుల్లి తెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం అయింది. ఈ మూవీ స్టార్ మా చానల్లో మొదటి సారి ప్రసారం అయినప్పుడు 8.83 "టీ ఆర్ పి" రేటింగ్ ను సంపాదించుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: