సడన్గా ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "శాకుంతలం" మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో గుణశేఖర్ ఒకరు. ఈ దర్శకుడు తన కెరీర్ లో చూడాలని ఉంది ... ఒక్కడు ... రుద్రమదేవి మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే రుద్రమదేవి మూవీ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గుణశేఖర్ ... దేవ్ మోహన్ హీరో గా సమంత హీరోయిన్ గా శాకుంతలం అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని రూపొందించాడు.

 ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , కన్నడ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా దక్కలేదు. చివరకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలి పోయింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలమైన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ రోజు నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: