"ఆది పురుష్" తెలుగు ట్రైలర్కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ లతో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఇండియా వ్యాప్తంగా స్టార్ డంమ్ ను సంపాదించుకున్నాడు.

ఇలా బాహుబలి సిరీస్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఆది పురుష్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను జూన్ 16 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది  ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ ను రెండు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లలో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ కు 10.60 మిలియన్ వ్యూస్ , 551.8 లైక్స్ ఒక చానల్లో లభించగా ... మరొక యూట్యూబ్ ఛానల్లో  ఈ మూవీ ట్రైలర్ కు 3.19 మిలియన్ వ్యూస్ , 244.1 కే లక్స్ లభించాయి. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు వర్షన్ ట్రైలర్ కు 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: