తమిళ ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తున్న నాగ చైతన్య..!!

murali krishna
అక్కినేని నాగచైతన్య తాజాగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి అయితే సిద్ధమయ్యారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను  అయితే నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో కూడా హాజరవుతూ సినిమాపై అంచనాలను అయితే పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చెన్నైలో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ క్రమంలోనే చెన్నైలో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారట.
వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున చిత్ర బృందం హాజరై సందడి కూడా చేశారు. ఇక ఈ కార్యక్రమంలో నాగచైతన్య తమిళ్ మాట్లాడుతూ స్పెషల్ అట్రాక్షన్ గా అయితే నిలిచారు. నాగచైతన్య తల్లి లక్ష్మీ చెన్నైలో ఉండటం వల్ల నాగచైతన్యకు తమిళం చాలా బాగా వచ్చు దీంతో ఈయన ఈ వేడుకలో తమిళంలో మాట్లాడి అందరిని కూడా ఆకట్టుకున్నారు.నాగచైతన్య మాట్లాడుతూ తమిళ అభిమానుల నుంచి ఈ స్థాయిలో ఆదరణ వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్ కూడా చేశారు. ఇక కస్టడీ సినిమా ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని ఆయన తెలియజేశారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నాగచైతన్య ధన్యవాదాలు తెలియజేశారు. ఇక చివరిలో నాగచైతన్య మాట్లాడుతూ...తమిళంలో కూడా నన్ను ఆదరించండి అంటూ అభిమానులను రిక్వెస్ట్ చేసుకున్నారని తెలుస్తుంది.. ఇక కృతి శెట్టి గురించి మాట్లాడుతూ ఆమె నాకన్నా చాలా సీనియర్ ఇదివరకే ఆమె తమిళ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చారు అంటూ నాగచైతన్య చమత్కరించారట.. ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: