ఆదిపురుష్: సలాం కొడుతున్న ట్రోలర్స్ ?

Purushottham Vinay
బాగా నిరాశగా ఉన్న అభిమానులలో ఒక్క వీడియోతో ఫుల్ జోష్ నింపాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో, రాధేశ్యామ్ వంటి డిజాస్టర్స్ తర్వాత ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అయ్యాడు డార్లింగ్.ఇప్పటి దాకా పాన్ ఇండియా స్టార్‏గా ఫాలోయింగ్ సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు నేరుగా హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తోన్న ఇతిహాస రామాయణ గాథ ఆదిపురుష్. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడె ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇందులో భాగంగా నిన్న ఈ మూవీ ట్రైలర్ ఏఎంబీ స్ థియేటర్లో అభిమానుల మధ్య రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ట్రైలర్ అయితే నిజంగా అదిరిపోయింది. ఎన్నో రకాల విమర్శల మధ్య వచ్చిన ఈ ట్రైలర్ సినిమా పై ఒక్కసారిగా హైప్ పెంచేసింది. నిన్న మొన్నటి దాకా ఈ మూవీ టీజర్ పై విమర్శలు చేసినవారే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.మన రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.


అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా గతంలో విడుదలైన టీజర్ పై చాలా విమర్శలు వచ్చాయి. రాముడు, రావణుడి పాత్రల కాస్ట్యూమ్స్, వీఎఫ్ఎక్స్ పై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేశారు.ఇంకా అంతేకాకుండా.. చిత్రయూనిట్ పై కూడా చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీని వాయిదా వేస్తూ.. వీఎఫ్ఎక్స్ మార్పులు చేపట్టింది చిత్ర యనిట్. ఇప్పుడు గ్రాఫిక్స్ రీవర్క్ చేసి ట్రైలర్ ని రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ కి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఒక్క ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచడమే కాకుండా.. ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడేలా చేసింది.ఆదిపురుష్ ట్రైలర్ తో ప్రభాస్ నిజంగా లెక్కలు మార్చేశాడని చెప్పొచ్చు. మొదటిసారి ప్రభాస్ రాముడిగా కనిపించబోతుండడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని టీసిరీస్ బ్యానర్ పై నిర్మి్స్తున్నారు. ప్రభాస్ ఇవే కాకుండా సలార్, ప్రాజెక్ట్ కె వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: