రామ్... బోయపాటి మూవీకి సంబంధించిన ఆ పనులు ప్రారంభం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో లలో ఒకరు అయినటు వంటి రామ్ పోతినేని ఆఖరుగా ది వారియర్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ తెలుగు ... తమిళ భాషల్లో విడుదల ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది. ఇలా ది వారియర్ మూవీ తో అపజయాన్ని అందుకున్న టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

దానితో ఈ మూవీ షూటింగ్ ను బోయపాటి రాపో అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ యూనిట్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ... రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తాజాగా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఇందుకు సంబంధించి బోయపాటి శ్రీను డబ్బింగ్ రూం లో ఉన్న ఒక ఫోటోను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. రామ్ ... బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: