"చైతూ" సోలో హీరోగా నటించిన ఆఖరి 6 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
నాగ చైతన్య సోలో హీరో గా నటించిన ఆఖరి 6 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో వాటి వివరాలను తెలుసుకుందాం.
నాగ చైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందినటు వంటి కస్టడీ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రియమణి , అరవింద స్వామి ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఇళయరాజా , యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ మూవీ ని మే 12 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 21.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నాగ చైతన్య హీరో గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన థాంక్యు మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటించింది.
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందిన లవ్ స్టోరీ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 31.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.
నాగ చైతన్య హీరో గా సమంత హీరోయిన్ గా రూపొందిన మజిలీ మూవీ కి 21.14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు శివ నర్వాణ దర్శకత్వం వహించాడు.
నాగ చైతన్య హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్ గా చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి మూవీ కి 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
నాగ చైతన్య హీరో గా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా మారుతీ దర్శకత్వంలో రూపొందిన శైలజ రెడ్డి అల్లుడు సినిమాకు 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: