మీడియం రేంజ్ మూవీలలో హైయెస్ట్ లాభాలను అందుకున్న తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
మీడియం రేంజ్ మూవీ లలో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా మీడియం రేంజ్ సినిమాలలో ఇప్పటి వరకు హైయెస్ట్ లాభాలను అందుకున్న టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం గీత గోవిందం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు 55.43 కోట్ల లాభాలు వచ్చాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , పరుశురామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
నిఖిల్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా 45.60 కోట్ల లాభాలను దక్కించుకుంది. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వం వహించాడు.
పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా రూపొందినటు వంటి ఉప్పెన మూవీ 31.02 కోట్ల లాభాలను అందుకుంది. కృతి శెట్టి మూవీ లో హీరోయిన్ గా నటించగా ... బుచ్చిబాబు సన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొంత కాలం క్రితం ఫిదా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి 30.5 కోట్ల లాభాలు దక్కాయి. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.
దుల్కర్ సల్మాన్ హీరో గా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా రూపొందిన సీతా రామం మూవీ కి 30.30 కోట్ల లాభాలు వచ్చాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: