సందీప్ రెడ్డి తో పాటు ఆ ఇద్దరిని లైన్లో పెట్టిన అల్లు అర్జున్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 1 మూవీ కంటే ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగించిన అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 1" మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

దానితో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే అల్లు అర్జున్ అదిరిపోయే రేంజ్ లో తన నెక్స్ట్ మూవీ లను సెట్ చేసుకుంటున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ తో ఒక మూవీ ఉండబోతున్నట్లు అల్లు అర్జున్ అధికారిక ప్రకటన కూడా చేసేసాడు. ఈ మూవీ తో పాటు మరో ఇద్దరు డైరెక్టర్ లను కూడా ఇప్పటికే అల్లు అర్జున్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక మూవీ చేయబోతున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం ఒక అదిరిపోయే కమర్షియల్ కథను తయారు చేస్తున్నట్లు ఒక వేళ ఈ కథ కనుక అల్లు అర్జున్ కు నచ్చినట్లు అయితే వీరి కాంబినేషన్ లో కూడా మరో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరి కాంబినేషన్ లో రేసుగుర్రం మూవీ రూపొంది బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: