చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెరిసిపోతున్న రాజ్ తరుణ్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ నటి మని హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ రాజ్ తరుణ్ హీరోగా రూపొందినటు వంటి కుమారి 21ఎఫ్ మూవీ తో మంచి విజయాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను కూడా సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు హెబ్బా పటేల్ అనేక సినిమాలో నటించినప్పటికీ ఎక్కువ శాతం మాత్రం రాజ్ తరుణ్ హీరో గా నటించిన సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే కుమారి 21 ఎఫ్ ... అందగాడు ... ఆడోరకం ఈడోరకం ... ఒరేయ్ బుజ్జిగా సినిమాలు రూపొందాయి. వీటిలో కుమారి 21 ఎఫ్ ... అందగాడు ... ఆడోరకం ఈడోరకం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా హెబ్బా పటేల్ "వ్యవస్థ" అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.  

ప్రస్తుతం సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా హెబ్బా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్నటువంటి ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా హెబ్బా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే క్లాస్ లుక్ లో శారీ కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: