పవన్ ఫ్యాన్స్ కి విసుగు తెప్పిస్తున్న పవన్ ..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ఇవ్వడం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు పలు సినిమాలు షూటింగ్ జరుగుతున్న పవన్ కళ్యాణ్ తన సినిమాల అప్డేట్లను మాత్రం ప్రకటించలేదు. కేవలం సినిమా టైటిల్స్ పలు పోస్టర్స్ ను మాత్రమే విడుదల చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటిస్తున్న వినోదయ సీతం సినిమా రీమిక్స్ లో నటిస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడుగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పోస్టర్స్ మంచి హైపున తీసుకోవచ్చాయి. కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి అధికారికంగా టైటిల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ఫైనల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ టైటిల్ విన్న అభిమానుల సైతం చాలా ఫైర్ అవుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన విసుగు పుట్టించేలా చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. PKSDT చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇందులో తేజ్ సరసన కేతిక శర్మ కూడా నటిస్తోంది.

గోపాల గోపాల సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు దేవుడు దిగి వచ్చిన అనే టైటిల్ ఖరారు చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ టైటిల్ కాదని మరొక టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఈ మల్టీస్ డాలర్ సినిమాకు" బ్రో" అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ టైముగా కనిపిస్తున్నారు ఆయనను టైం అని పిలవలేక తేజ్ బ్రో అని పిలుస్తాడట.. అందుకే టైటిల్ కు జస్టిఫికేషన్లో బ్రో అని టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ టైటిల్ మాత్రం పవన్ ఫ్యాన్సులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: