తల్లి పాత్రలకు కూడా నేను రెడీ.. వాసుకి ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ఒకప్పుడు హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారు.. ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా మారిపోవడంతో ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ అలరిస్తున్న ఒకప్పటి హీరోయిన్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా తాను తల్లి పాత్రల కోసం సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది ఒకప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్. తొలిప్రేమ చిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరిగా నటించిన వాసుకి మంచి గుర్తింపును సంపాదించింది.

 అయితే ఇప్పుడు ఏకంగా తల్లి పాత్రలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ చెబుతుంది వాసుకి. ఇటీవల లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం అన్నీ మంచి శకునములే. ఈనెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో ఒక క్యూట్ పాత్రలో నటించింది వాసుకి. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను తెరమీద కనిపించి 23 ఏళ్లు అవుతుంది.

 తొలిప్రేమ సినిమా చేసినప్పుడు నాకు ఏమీ తెలియదు. అంతా కరుణాకరన్ వల్లే నేను నటించగలిగాను. ప్రతి విషయం లోను నేను ఆయన చెప్పినట్టు చేశాను. భాష తెలియదు ఇంగ్లీషులో డైలాగులు రాసుకుంటే తమిళంలో దాని అర్థం చెప్పేవాడు. ఇక ఆ సినిమాలో నాకు నంది అవార్డు కూడా వచ్చింది. దీనికి కారణం కేవలం కరుణాకరన్ మాత్రమే.  కానీ ఇప్పుడు నటనపై నాలెడ్జ్ ఉంది. ఇక ప్రతి పాత్రకు అంచనాలకు తగ్గట్టుగా న్యాయం చేయాలని అనుకుంటున్నా అంటూ వాసుకి తెలిపింది. 23 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ అక్క చెల్లె పాత్ర చేయాల్సి వచ్చింది అని ఫీలింగ్ కలుగలేదు. ఎందుకంటే నాకు తల్లి పాత్ర చేయమని చెప్పలేదు కదా. కానీ మంచి పాత్ర ఉంటే తల్లి పాత్రలో  నటించడానికి కూడా నేను రెడీ అంటూ వాసుకి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: