ట్రైలర్: ప్రభాస్ ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్..!!

Divya
భారీ బడ్జెట్ తో బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉండగా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సీత పాత్రలో కృతి సనన్ నటించగా.. రావణాసురి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరిగింది. గడచిన కొద్ది రోజుల నుంచి ఈ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా అప్డేట్లను చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది.

 ఆది పురుష్ చిత్రానికి సంబంధించి ఈ రోజున గ్రాండ్గా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.2D,3D ఫార్మాట్లో విడుదల చేయడం జరిగింది. 3D ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు దేశమంతట పలు థియేటర్లలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది అయితే అంతకంటే ముందు రోజు ఈ రోజు మధ్యాహ్నం ఈ సినిమా ట్రైలర్ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు అనుకున్నట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ చూసిన ఆడియో గ్రాఫిక్స్ కంటే VFX వర్క్ బాగుందంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఇక జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని రూ .600 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్ మూవీ విడుదల చేయడం జరుగుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరి ఎటువంటి విజయాలను అందుకుంటుందో చూడాలి మరి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడం గమనార్హం. ఆది పురుష్ సినిమా అయినా ప్రభాస్ అభిమానులను ఖుషి చేసేలా కనిపిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: