పవన్ ... సాయి తేజ్ మూవీలో పబ్ సాంగ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రస్తుతం ఒక మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తన భాగం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా తమిళ మూవీ అయినటువంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమా యొక్క ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ రీమేక్ మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా వినోదయ సీతం అనే మూవీ కి రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథ లోను ... స్క్రీన్ ప్లే లోను అనేక మార్పులు ... చేర్పులను చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని జూన్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా యొక్క టైటిల్ ను మరో రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి "బ్రో" అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఆల్మోస్ట్ ఇదే టైటిల్ ను ఈ చిత్ర బృందం కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా లోని పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తుంది.

ఈ సాంగ్ కోసం ఈ మూవీ యూనిట్ అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత భారీ సెట్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ పబ్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ... సాయి తేజ్ మొట్ట మొదటి సారి కలిసిన నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ బృందం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: