వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీకి 26 ఏళ్లు..!

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సీనియర్ స్టార్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. వెంకటేష్ కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ మూవీ లలో "ప్రేమించుకుందాం రా" మూవీ ఒకటి.

ఈ మూవీ లో వెంకటేష్ సరసన అంజలి జావేరి హీరోయిన్ గా నటించగా ఈ మూవీ కి జయంత్ సి. పరాంజీ దర్శకత్వం వహించాడు. ప్రేమ కథ తో రూపొందిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమా 9 మే 1997 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయ్యి నేటితో 26 సంవత్సరాలు అవుతుంది.

ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించాడు. ఈ మూవీ లోని వెంకటేష్ ... అంజలి జావేరి జంటకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ లో వెంకటేష్ ... అంజలి నటనకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే వెంకటేష్ తాజాగా సల్మాన్ ఖాన్ హీరో గా రూపొందినటువంటి "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే హిందీ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పెద్దగా ఆదరించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: