కీర్తి సురేష్ "మహానటి" మూవీకి నేటితో ఐదేళ్లు..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కీర్తి ... రామ్ పోతినేని హీరో గా రూపొందినటు వంటి నేను శైలజ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. నేను శైలజ మూవీతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత నేను లోకల్ మూవీ తో మరో విజయాన్ని అందుకుంది.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రెండు కమర్షియల్ విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే కీర్తి సురేష్ "మహానటి" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించగా ... మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ అలనాటి స్టార్ కథానాయక అయినటు వంటి సావిత్రి గారి జీవిత కథ ఆధారంగా రూపొందింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి అంచనాల నడుమ 9 మే 2018 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. ఈ మూవీ లోని కీర్తి నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మహానటి సినిమా నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: