ఈరోజు తెలుగు సినిమా షూటింగ్ అప్డేట్స్..!

Pulgam Srinivas
ఈ రోజు మంచి క్రేజ్ ఉన్న తెలుగు సినిమాల షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం.
పుష్ప ది రూల్ : ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర లో నటిస్తున్న నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
ఖుషి : విజయ్ దేవరకొండ హీరో గా సమంత హీరోయిన్ గా శివ నర్వన దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ "కొచ్చి" లో తాజాగా ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ పై చిత్ర బృందం కొన్ని కీలక సన్నివేశా లను చిత్రీకరించబోతుంది .
ఓజి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం పూణే పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ రోజు తో ఈ షెడ్యూల్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
ఎన్ బి కె 108 : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ బృందం ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో జరుపుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో బాలకృష్ణ జాయిన్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: