"ఖుషి" మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన విజయ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా విజయ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.
 

అనన్య పాండే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రమ్య కృష్ణ , మైక్ టైసన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. లైగర్ లాంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్ "ఖుషి" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. సమంత ఈ మూవీ లో విజయ్ కి జోడి గా నటిస్తూ ఉండగా ... శివ నర్వన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీ కి హుస్సేన్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసింది. ఈ మొదటి పాటను ఈ మూవీ యూనిట్ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: