వైట్ కలర్ శారీలో అందుకు తగిన బ్లౌజ్లో అలరిస్తున్న ప్రభాస్ హీరోయిన్..!

Pulgam Srinivas


మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాళవిక తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొంత కాలం క్రితం మాళవిక ... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తలపతి విజయ్ హీరో గా రూపొందిన మాస్టర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ సినిమా ఆటు తమిళ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది.

ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మకు అటు తమిళ ఇండస్ట్రీ లోను ... ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోను అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాళవిక ... రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక అద్భుతమైన విజయం సాధించినట్లు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాళవిక క్రేజ్ అమాంతం పెరిగి పోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే వరుస సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా మాళవిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ సారీ ని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: