బెల్లంకొండ శ్రీనివాస్..చత్రపతి రీమిక్స్ పై.. ప్రభాస్ ఏమన్నారంటే..?

Divya
గతంలో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం చత్రపతి.. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయారు. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాని టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో రీమేక్ చేయడం జరిగింది. అక్కడ వివి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంతో బాలీవుడ్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ నార్త్ ఇండియాలో చాలా స్పీడ్ గా తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాతో తనను తాను ప్రమోట్ చేసుకుని ప్రయత్నంలో అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చత్రపతి రీమిక్స్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ చిత్రాన్ని రీమిక్స్ చేయడానికి తాను ముందుగా ఆలోచించానని అయితే ప్రభాస్ తో ఈ సినిమా రీమిక్స్ విషయం చర్చించినప్పుడు నువ్వు ఈ సినిమా చేయడానికి పూర్తిస్థాయిలో అర్హత ఉన్నవాడివి నువ్వు చేయగలవు అంటూ ధైర్యం చెప్పారట.
దీంతో తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందని ఈ సినిమాలో తనను తాను చేయగలనే నమ్మకాన్ని ప్రభాస్ తనకు కల్పించాలని బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతగా పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమాని ప్రమోషన్స్ లో భారీగానే ఖర్చు పెడుతున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ సినిమాని నాకు మార్కెట్లో ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనెక్ట్ అవుతుందో చూడాలి మరి. ఈ సినిమా సక్సెస్ అయితే తన తదుపరి చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: