చిరంజీవి నెక్స్ట్ మూవీ ఆ బ్యానర్లో... నిర్మాత ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి వేదాలం అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందుతుంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మహతీ స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన భారీ ఎత్తున ధియేటర్ లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం కోల్కతా నగరంలో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే చిరంజీవి ఈ మూవీ తర్వాత సోగ్గాడే చిన్నినాయన ... బంగార్రాజు లాంటి విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించినటు వంటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని చిరంజీవి కూతురు అయినటువంటి సుస్మిత" గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్" బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే చిరంజీవి కోసం అదిరిపోయే పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: