మెగాస్టార్ నెక్స్ట్ పై ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య ... గాడ్ ఫాదర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో ఆచార్య మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ రెండు మూవీ లలో ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచగా గాడ్ ఫాదర్ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం చిరంజీవి "వాల్టేర్ వీరయ్య" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా సాధించింది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బాబి కొల్లి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ... మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ , సుశాంత్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయమన్నారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి ... కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటువంటి "బ్రో డాడి" కి రీమేక్ గా తెరకెక్కబోతుంది అని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. కాకపోతే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు అని చిరంజీవి ... కళ్యాణ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కొత్త కథతో ఉండబోతునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: